గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులూ పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు... 16 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ 1.60 లక్షల నగదు, 16 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ బిలా ఉద్దీన్ తెలిపారు.
ఇదీచదవండి.