గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 17 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 ద్విచక్రవాహనాలు, 72 వేల రూపాయల నగదు, 18 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతవరానికి చెందిన కోటేశ్వరరావు కొంతకాలంగా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ ధర్మేంద్ర బాబు చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామన్నారు.