లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి రావడంతో సీజ్ చేసిన వాహనాలను తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. లాక్డౌన్ సడలింపులతో డీజీపీ ఆదేశాల మేర వాటిని తిరిగి వాహనదారులకు అందిస్తున్నారు. లోక్ అదాలత్ కోర్టులో వీటిని ప్రవేశపెట్టే వరకు వాహనాలు చెడిపోకుండా యజమానులకు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై వాహనాలు అప్పగిస్తున్నారు. మార్చి 23 నుంచి 26 వరకు స్వాధీనం చేసుకున్న వాహనాలను తొలుత అప్పగిస్తున్న పోలీసులు, రోజుల వారీగా వీటిని వాహనదారులకు అప్పజెబుతున్నారు.
స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో వేలాది వాహనాల్ని ఉంచగా.. వాటిలో నుంచి తమ వాహనం తీసుకోవడం వాహనదారులకు గగనంగా మారింది. వాహనదారులు నుంచి ఆర్సీ, లైసెన్సు, ఇన్సూరెన్స్ ధ్రువపత్రాల నకళ్లను తీసుకుంటున్నారు. కొందర ధ్రువపత్రాలు వాహనంలోనే ఉండిపోవడం, వాహనాలు తీసుకోలేక అగచాట్లు పడుతున్నారు.
ఇవీ చూడండి...