గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని చింతరేవులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి (Police raid) చేశారు. జిల్లా SEB పోలీసు అధికారులు చేసిన.. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు 80 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.48 లక్షల నగదు స్వాధీనం చేసుకుని.. 40 కార్లను సీజ్ చేశారు.
తీర ప్రాంతంలో ప్రత్యేక డెన్ ఏర్పాటు చేసి శిబిరాన్ని నిర్వాహకులు నడుపుతున్న పోలీసులు తెలిపారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులతో దాడి చేయించారు. కరోనా కారణంగా వీరందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నట్లు వారు తెలిపారు.
ఇవీ చదవండి:
వాస్తవిక దృక్పథంతోనే పట్టణాల పురోగతి
CID JUDGE : సీఐడీ న్యాయమూర్తికి రఘురామ బెయిల్ పూచికత్తు అందజేత