గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం చింతరేవు రోడ్డులోని ఓ పేకాట స్థావరంపై శనివారం రాత్రి సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ. 51,300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడి పందేలు, పేకాట నిర్వహణ లాంటి ఘటనలపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని స్థానికులను పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: