గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda)లో వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారం కొట్టేసిన(gold Theft) నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో అటెండర్‌గా పని చేస్తున్న సుమంత్ రాజు రూ.2.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కాజేశాడు. దీనిపై ఈనెల 6వ తేదీన బాపట్ల పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు. నిందితుడు సుమంత్ రాజు బ్యాంకులోని బంగారు ఆభరణాలు తీసుకెళ్లి రెండు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో పాటు.. ఓ జాతీయ బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో జల్సాలు చేశాడు.
ఈనెల 2వ తేదీన బ్యాంకు ఆడిటింగ్ జరగటంతో బంగారం మాయమైన విషయం బయటపడింది. అప్పటికే సుమంత్ రాజు పారిపోయాడు. సుమంత్ రాజు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి చాలావరకూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నిందితుడు కూడా దొరకటంతో ఈ వ్యవహారంతో ఎవరెవరికి సంబంధాలున్నాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేపు సుమంత్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
ఇదీ చదవండి