ETV Bharat / state

tadepalli rape case: తాడేపల్లి అత్యాచారం కేసు.. అదుపులో ఇద్దరు - తాడేపల్లి అత్యాచారం కేసు న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లిలో యువతిపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.యువతి వద్ద నుంచి దోచుకెళ్లిన సెల్‌ఫోన్‌ ఆధారంగానే వారిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. నేడు వారి అరెస్ట్‌ను అధికారికంగా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.

tadepalli rape case
అదుపులో ఇద్దరు
author img

By

Published : Jun 23, 2021, 7:29 AM IST

తాడేపల్లి అత్యాచారం కేసు.. అదుపులో ఇద్దరు

తాడేపల్లిలోని పుష్కరఘాట్ అత్యాచార ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి సుచరిత ధ్రువీకరించారు. పూర్తి విచారణ తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు. యువ జంట వద్ద నిందితులు దోచుకెళ్లిన ఫోన్ల ద్వారానే వారు పట్టుబడ్డారు. తాడేపల్లికి చెందిన తాపీమేస్త్రీకి నిందితులు ఫోన్‌ను విక్రయించారు. అప్పటి నుంచి స్విచ్ఛాప్‌లో ఉన్న ఫోన్‌ను మంగళవారం ఆన్‌చేయగానే...టవర్‌ లొకేషన్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. ఫోన్‌ వినియోగిస్తున్న మహిళను విచారించగా ...తన భర్తకు విజయవాడలో ఎవరో విక్రయించారని తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఒకరిది తాడేపల్లి.. మరొకరిది చినగంజాం...

నిందితులిద్దరికీ నేరచరిత్ర ఉంది. వారిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లోని నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నవారిపై దాడి చేసి దోచుకుంటారని తెలిసింది. వీరిలో ఒకరిది తాడేపల్లి కాగా...మరొకరిది ప్రకాశం జిల్లా చినగంజాం. ఈనెల 19న రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు నదీమార్గంలో పడవపై పారిపోయి తాడేపల్లికి చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడంతో 20న పరారయ్యారు.

బాధితురాలికి సాయం అందజేత

తాడేపల్లి అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతామన్నారు. ఎవరు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా..... దిశ, అభయ్‌ యాప్‌లను వాడేలా మరింత ప్రచారంలోకి తీసుకొస్తామని జగన్‌ చెప్పారు. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల సాయాన్ని హోం మంత్రి సుచరిత..... బాధితురాలి తల్లికి గుంటూరుజీజీహెచ్​లో అందజేశారు.

ఇదీ చదవండి

CM Jagan: జగన్‌పై నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై సుమోటో కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.