గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో గంజాయి వ్యాప్తిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న పోలీసులు.. వీటితో పాటు విద్యార్థుల వసతి గృహాలను తనిఖీ చేపట్టారు. తాడేపల్లిలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉన్న బాలుర వసతి గృహాలను తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎక్కువగా ఆ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కళాశాల వసతి గృహాలల్లో సోదాలు చేశారు. అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులెవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వసతి గృహ నిర్వాహకులకు చెప్పారు.
ఇదీ చదవండి: ముగిసిన ప్రథమ జాతీయ స్థాయి పద్యనాటక పోటీలు