గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడుపై కేసు నమోదైంది. వీసీ తనని కులం పేరుతో దూషించారని యూనివర్సిటీ మాజీ ఉద్యోగి మురళీకృష్ణ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు గతంలో యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశారు. అతన్ని ఏప్రిల్లో ఉద్యోగం నుంచి తొలగించారు. మళ్లీ ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని... ఈ నెల 23 వ తేదీన దామోదర నాయుడు సచివాలయానికి వచ్చిన సమయంలో మరోసారి కలిసి ప్రస్తావించగా... కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వీసీపై కేసు నమోదు - ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడుపై కేసు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడిపై కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని యూనివర్శిటీ మాజీ ఉద్యోగి మురళీకృష్ణ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడుపై కేసు నమోదైంది. వీసీ తనని కులం పేరుతో దూషించారని యూనివర్సిటీ మాజీ ఉద్యోగి మురళీకృష్ణ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు గతంలో యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశారు. అతన్ని ఏప్రిల్లో ఉద్యోగం నుంచి తొలగించారు. మళ్లీ ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని... ఈ నెల 23 వ తేదీన దామోదర నాయుడు సచివాలయానికి వచ్చిన సమయంలో మరోసారి కలిసి ప్రస్తావించగా... కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
k.veerachari, 9948047582
పవిత్రమైన రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతూ రహదారి నిర్మాణం జరిగింది. కడప రాజంపేట జాతీయ రహదారిలో రామాపురం చెక్ పోస్ట్ నుంచి ఇసుకపల్లి, తాళ్ళపాక మీదుగా హత్యరాలకు 2009లో సుమారు 4.4 కోట్ల రూపాయలతో 9.6 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. ఈ రహదారి ఇప్పుడు దారుణంగా ఉంది. ఎటు చూసినా రహదారి ఎత్తుపల్లాలు, గుంతల మయంగా దర్శనం ఇస్తోంది. తాళ్ళపాక సమీపంలోని కాజ్ వే అడ్డదిడ్డంగా పుచ్చకాయ పగిలినట్లు ఉంది. ఈ మార్గంలో ప్రయాణికులు స్థానిక ప్రజలు వెళ్లలేక నానా అగచాట్లు పడుతున్నారు. రామాపురం ఇసుకపల్లి కి మధ్యలో పర్యాటక మార్గం పనులు అసంపూర్తి గానే ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన ఒక వంతెన అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒడిదుడుకుల మధ్య రహదారిపై ప్రయాణించడం నరకంగా ఉందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వమైనా స్పందించి రహదారి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Body:తాళ్ళపాక హత్యరాల పర్యాటక మార్గం దయనీయం
Conclusion:కడప జిల్లా రాజంపేట
TAGGED:
ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం