అధికార పార్టీ ప్రజాప్రతినిథులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణతో.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన నాయకుడు తవిటి భావన్నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ కల్యాణ్ డిమాండ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేశారు.
వాటిని తప్పుపడుతూ భావన్నారాయణ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని వైకాపా నేత మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భావన్నారాయణపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు.
ఇవీ చదవండి..