గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేత కోడెల శివరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రేపు నరసరావుపేటలో లోకేశ్ పర్యటన దృష్ట్యా ఇప్పటికే పలువురు తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. తెదేపా నాయకుడు అరవిందబాబును గృహనిర్బంధం చేశారు. గురువారం నరసరావుపేటలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు.
గురువారం లోకేశ్ పర్యటన
గుంటూరు జిల్లాలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ నరసరావుపేటకు వెళ్లనున్నారు. అయితే లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కొవిడ్ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. అనూష హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ చేశామని చెప్పారు. పాత కేసులతో ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేయొద్దని కోరారు.
ఇదీ చదవండి