ETV Bharat / state

రెండు నెలల్లో 2373 కోట్ల రూపాయలకు పెరిగిన పోలవరం అంచనాలు - పోలవరం తొలి దశ పనులు

Polavaram Estimates Increased by 2373 Crore Rupees in 2 Months : పోలవరం తొలి దశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి కావాల్సిన అంచనాలు 2 నెలల్లో 2 వేల 373 కోట్ల రూపాయలకు పెరిగాయి. కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ సోమవారం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

Polavaram_Estimates_Increased_by_2373_Crore_Rupees_in_2_Months

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 11:10 AM IST

Polavaram Estimates Increased by 2373 Crore Rupees in 2 Months : పోలవరం తొలి దశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి కావాల్సిన అంచనాలు 2 నెలల్లో 2 వేల 373 కోట్ల రూపాయలకు పెరిగాయి అంటే 13.84 శాతం. కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ (Bishweswar Tudu) సోమవారం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ (MP Kanakamedala Ravindra Kumar) అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

POLAVARAM: పోలవరం తొలి దశకు రూ.9,000 కోట్లు..అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం

Bishweswar Tudu Comments on Polavaram Project In Rajya Sabha : 41.5 మీటర్ల వరకు నీటిని నిలబెట్టేలా తొలి దశలో మిగిలిన పనులను పూర్తి చేయడానికి 17 వేల144 కోట్లు కావాలని జూన్‌లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నాటికి దాన్ని 19 వేల 517 కోట్లుగా పేర్కొన్నట్లు మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ వెల్లడించారు. 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా ప్రాజెక్టు తొలి దశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 17 వేల144.06 కోట్లు అవసరమవుతాయని రాష్ట్రం ఈ ఏడాది జూన్‌ 5న ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదనలు సమర్పించింది. అయితే ఆగస్టు 2న రాసిన మరో లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం తొలి దశ పనులు సవరించిన అంచనాలను 37 వేల 59 కోట్లుగా పేర్కొంటూ కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో తొలి దశ మిగిలిన పనుల కోసం 19 వేల 517.36 కోట్లు కావాల్సి వస్తుందని పేర్కొంది.

'పోలవరం' ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం - రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: అంబటి రాంబాబు

Rajya Sabha Discussion on Polavaram Project Works : విభాగాల వారీగా చూస్తే ఇందులో మిగిలిన హెడ్‌వర్క్స్‌ పూర్తికి 10 వేల 222.17 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ మిగిలిన పనుల పూర్తికి 12 వందల 25.80 కోట్లు, కుడి ప్రధాన కాలువ పనుల పూర్తికి 412.81 కోట్లు, మిగిలిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, భూసేకరణ కోసం 7 వేల 856.58 కోట్లు కావాలని పేర్కొంది. దీనిపై ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం కలిసి మదింపు చేస్తున్నాయి. జలసంఘం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. ఇందులో తొలి అడుగు కింద, జల్‌శక్తి శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (Revised Cost Committee of Hydropower Department)ని ఏర్పాటు చేసిందని వివరించారు.

CM Jagan Silence on Polavaram Project: సీఎం జగన్ మౌనముద్ర.. పోలవరం ప్రాజెక్ట్​కు వేల కోట్ల రూపాయల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.