కరోనా వైరస్ నేపథ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రోడ్డుపక్కన ఉండే దుకాణాలను ఈనెల 31 వరకు మూసేయాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటి వద్దనే ఉండేలా.. తగు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి : కరోనా మృతదేహాల ఖననంపై కేంద్రం మార్గదర్శకాలు