ETV Bharat / state

పూర్తికాని పిడుగురాళ్ల బైపాస్‌ రహదారి నిర్మాణం - పిడుగురాళ్ల బైపాస్‌ రహదారి నిర్మాణం వార్తలు

చెన్నై-కోల్‌కతాతో పాటు ముంబయి-పుణె జాతీయ రహదారులను అనుసంధానం చేసే కీలక మార్గం అది. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు రాకపోకలు సాగించే ప్రధాన మార్గం. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ప్రయాణానికి పిడుగురాళ్ల పట్టణంలో బ్రేకులు పడుతున్నాయి. వాహనదారులకు ఇక్కట్లతో పాటు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా ఇక్కడి బైపాస్‌ రోడ్డు నిర్మాణం సాగుతోంది.

piduguralla bypass
piduguralla bypass
author img

By

Published : Jun 18, 2020, 12:27 PM IST

అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పనులు 2011 సంవత్సరంలో ప్రారంభించారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతూనే, మరోవైపు మాచర్ల రోడ్డులోని ఖలీల్‌ రెస్టారెంట్‌ దగ్గర నుంచి గుంటూరు రోడ్డులోని రిలయెన్సు పెట్రోలు బంకు వరకు ఆరు కిలోమీటర్లు దూరం బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2012లో గుత్తేదారు పనులు ప్రారంభించగా, భూములు, స్థలాలు కోల్పోయిన బాధితులు కోర్టుకు వెళ్లి నిర్మాణ పనులను నిలిపివేయించారు. ఎంత పరిహారం చెల్లించాలనే విషయంపై రెవెన్యూ అధికారులు పలుమార్లు బాధితులతో సమావేశాలు నిర్వహించారు. చివరకు కొంతమందికి 2016లో పరిహారం చెల్లించారు. 2017లో గుత్తేదారు నిర్మాణ పనులు ప్రారంభించి కొన్నాళ్లు చేశారు. గుత్తేదారునికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో నిర్మాణ పనులు ఆపివేశారు. మరలా 2019లో నిర్మాణ పనులను ప్రారంభించారు. కొన్ని రోజులు చేసి వదిలివేశారు. ఇంకా భూసేకరణ చేయాల్సి ఉందని, భూమి అప్పగిస్తే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు అంటున్నారు.

మలుపుల చిక్కులెన్నో...

బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 60 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2016లో 43 ఎకరాలు భూమికి పరిహారం చెల్లించారు. రోడ్డు నిర్మాణంలో 13.56 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా పోతుంది. అయితే ఖలీల్‌ రెస్టారెంట్‌ ఎదురు అసైన్డ్‌ భూమి 4.12 ఎకరాలు ఉంది. ఈ భూమిని చాలాకాలం నుంచి కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి పరిహారం చెల్లించాలని సాగు చేసుకునే రైతులు కోరుతున్నారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి పరిహారం ఇవ్వమని రెవెన్యూ అధికారులు సాగు చేసుకునే రైతులకు చెప్పారు. దీంతో 4.12 ఎకరాల భూమి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయకుండా అలాగే వదిలివేశారు.

రిలయన్స్‌ పెట్రోలు బంకు సమీపంలో 3.44 ఎకరాల భూమిని భూసేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో రైతులు, వ్యాపారులు రోడ్డు నిర్మాణంలో పోయే భూమికి గజాల లెక్కన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. కాని రెవెన్యూ అధికారులు మాత్రం ఎకరాల లెక్కన పరిహారం చెల్లిస్తామని అంటున్నారు. ఇక్కడ పరిహారం ఎంత ఇస్తారనేది తేలితే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.

బైపాస్‌ రోడ్డులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనుక భాగంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. అయితే రైల్వే శాఖ రూ.7 కోట్లు చెల్లించాలని చెప్పడంతో అంచనాలు తగ్గించాలని రైల్వే శాఖకు ప్రభుత్వం తరఫున లేఖ రాశారు.

అధికారులు ఏమంటున్నారంటే...

బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ఇంకా సేకరించాల్సిన 3.44 ఎకరాల భూమికి సంబంధించి రైతులతో 25వ తేదీన సమావేశం నిర్వహిస్తాం. ప్రభుత్వ రేటు ప్రకారం పరిహారం నిర్ణయిస్తామని గురజాల ఆర్డీవో పార్థసారథి పేర్కొన్నారు. పరిహారం చెల్లించిన తరువాత గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ రూ.7కోట్లు చెల్లించాలని కోరడంతో మరలా పునః పరిశీలన చేయాలని, ఆశాఖకు లేఖ రాసినట్లు రహదారిని పర్యవేక్షిస్తున్న ఇన్‌ఛార్జి డీఈ చంద్రశేఖరరెడ్డి చెప్పారు.

  • పిడుగురాళ్ల పట్టణంలో ఓవర్‌ బ్రిడ్జి నుంచి మార్కెట్‌ వరకు దూరం : 2 కిలోమీటర్లు
  • ఈ కొద్ది దూరం దాటేందుకు పడుతున్న సమయం : అరగంట
  • రద్దీగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే : గంట సమయం
  • ఇరుకుగానున్న పట్టణ వీధుల్లో నిత్యం ప్రమాదాలతో ఎంతోమంది బాధితులవుతున్నారు.
  • పిడుగురాళ్ల బైపాస్‌ రోడ్డు పొడవు 6 కిలోమీటర్లు
  • నిర్మాణం మొదలుపెట్టింది 2012
  • అవసరమైన భూమి 60 ఎకరాలు
  • భూ సేకరణ చేయాల్సింది: 3.44 ఎకరాలు

ఇదీ చదవండి: 'ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్​ ఉండకపోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.