గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను యడ్లపాడు పరిధిలోని నక్క వాగు సమీపంలో క్రేన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండటంతో.. అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై వన్ వే అమలు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెట్రోల్ ట్యాంకర్‌ను సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి లీక్ అవుతున్న పెట్రోల్‌ను బయటకు తీశారు.
ఇదీచదవండి.