రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథార్టీ ఛైర్మన్ గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్ ను నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది . నియామకానికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది జూన్ 20 న జారీ చేసిన జీవో 57 ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది పారా కిశోర్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . హాంశాఖ ముఖ్యకార్యదర్శి ,రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథార్టీ( ఏపీఎస్‌పీసీఏ) ఛైర్మన్, వ్యక్తిగత హోదాలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు . ఈ వ్యాజ్యంలోని ముఖ్యాంశాలు
- రాష్ట్ర పోలీసు కంప్లయింట్స్ అథార్టీ నిబంధన 4(ఏ) విరుద్ధంగా ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజ్‌ను నియమించారు. చైర్మన్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు విధానాన్ని రూపొందించిందన్నారు . రాజకీయ , కార్యనిర్వహణ జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రకాశ సింగ్ కేసులో సుప్రీంకోర్టు విధించిన నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన వయసు 78 ఏళ్లు , ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి చట్ట ప్రకారం 65 ఏళ్లు వచ్చే వరకే ఆ పదవిలో కొనసాగుతారు. వయసు రీత్యా అర్హత లేని వారిని ఛైర్మన్‌గా నియమించారు.
- రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గతంలో జస్టిస్ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సర్కారు నియమించింది. ఆ నియామకాన్ని హైకోర్టు రద్దుచేసింది . దీంతో గత నియామకానికి బదులుగా మళ్లీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు. జస్టిస్ కనగరాజ్ కు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం ఈ నియామకానికి కారణం. నియామకానికి వీలుగా నిబంధనలను సవరించారు వెనుక దురుద్దేశం ఉందన్నారు . సంబంధిత జీవో నోట్ పైళ్లను న్యాయస్థానానికి తెప్పించి పరిశీలించండి... ఆ జీవోను రదు చేయండి అని పారా కిశోర్ కోరారు
- అదనపు ఎస్పీ , అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను ఈ అథార్జీ విచారణ చేయనుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన , పోలీసు కస్టడీలో మృతి , దాడి , అత్యాచారం వంటి ఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన ఫిర్యాదులను ఆథార్జీ విచారణకు స్వీకరిస్తుంది .
ఇదీ చదవండి