దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి కలహం.. భర్త బలవన్మరణానికి దారి తీసింది. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిందీ ఘటన. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ పర్చూరు నాగూల్ మీరా అనే వ్యక్తికి.. కొమ్మూరుకు చెందిన ఓ యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వారిరువురి మధ్య కలహాలు రాగా.. భార్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని భర్త కోరినప్పటికీ.. ఆమె నిరాకరించింది. మనస్థాపం చెందిన నాగుల్ మీరా.. బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: