ETV Bharat / state

రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు

రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడి తీవ్రగాయాలైన ఘటన గుంటూరు జిల్లా అప్పికట్ల సమీపంలో జరిగింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Jul 18, 2019, 12:54 PM IST

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది తీవ్ర గాయాలైన అతడిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది తీవ్ర గాయాలైన అతడిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

ప్రాణం తీసిన ఆరాటం.. గుప్త నిధుల కోసం వ్యక్తి బలి

Intro:విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించే వనరు తాండవ నది రోజురోజుకు కలుషితం అవుతుంది . కారణంగా ప్రజలు తీవ్ర తాగునీటి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తాగునీటి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు... విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ మిగులు జలాలు తాండవ నది రూపంలో పాయకరావుపేట మండలానికి చేరుతాయి. ఈ నదీ జలాలు వరద నీటి రూపంలో సమీపంలో ఉన్న పెంటకోట గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. తుని, పాయకరావు పేట ప్రాంతాలకు చెందిన సుమారు రెండు లక్షల మందికి తాగునీరు, 2.50 లక్షల పైగా పంట భూములకు సాగునీరు అందించే ప్రధాన వనరు ఇది. ఇంత విలువైన నీటివనరులు రోజురోజుకు కలుషితమవుతుంది. ఈ పరిస్థితి పై పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. సమీప తుని మున్సిపాలిటీ, పాయకరావుపేట మేజర్ పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్త , కోళ్ల వ్యర్థాలు వంటివి వందల టన్ను ల కొద్ది నదిలో పార పోస్తున్నారు . దీంతోపాటు మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన మురుగు కాలువలు నదిలో మళ్లింపు చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే వరద నీరు నదిలో చేరి ప్రవాహం వెళ్లే దారి లేక జంట ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. భవిష్యత్తులో జంట ప్రాంతవాసులకు తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడనుందని భూగర్భ శాస్త్రవేత్తలు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిపుణులు హెచ్చరించినా.... : ఈ నదిపై అధ్యయనం చేసేందుకు గతంలో ఆంధ్ర యూనివర్సిటీ జియాలజిస్టులు పర్యటించి నదీజలాలు కలుషితమవుతున్నాయని తక్షణం మేల్కోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అయినా ఇక్కడ అధికారుల్లో స్పందన లేదు. రోజురోజుకు చెత్త వేయడంతో నదీ గర్భం మొత్తం కనుమరుగైపోతుంది...

నదికి ఇరువైపులా ఆక్రమణలు.... : ఈ నదికి ఇరువైపులా రక్షణ గట్లు సుమారు 3 కిలోమీటర్ల మేర ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల వరద కోత కారణంగా ఇసుక మేట వేయడంతో నదికి ఆనుకుని ఉన్న రైతులు ఈ గర్భాన్ని ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. కారణంగా నది దిశ మారిపోయి వరద నీరు గ్రామాల మీదకు వస్తోంది..

అధికారుల వివరణ: నదిలో చెత్త సమస్యపై ఈ ఓపీఆర్ డి, పాయకరావుపేట పంచాయతీ ప్రత్యేక అధికారి వెంకట నారాయణ మాట్లాడుతూ... నదిలో చెత్త వెయ్యకుండా పంచాయతీ సిబ్బంది సూచించి, ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు నదీజలాలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


కె. జ్యోతి రాజ్, 80085 74980
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట

note: సార్ ర్ ఈ ఫైల్ వాడలేదు కనుక rewrite చేసి పంపించాను పరిశీలించగలరు.




Body:g


Conclusion:h

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.