గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొవిడ్ 19 ఆస్పత్రిని ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమంటూ.. స్థానికులు ఆందోళన చేపట్టారు. అనుమతి ఇచ్చింది ఒకచోట అయితే.. మరొక చోట ఆస్పత్రిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో, పట్టణ సీఐ సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పైఅధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆందోళనకారులకు సర్దిచెప్పి వెనక్కు పంపారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....