ETV Bharat / state

బ్రాడీపేట కంటైన్మెంట్ జోన్ వద్ద ప్రజల ఇక్కట్లు - latest news of bradipeta zone

గుంటూరులోని బ్రాడిపేట కంటైన్మెంట్ జోన్ వద్ద ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాసులు ఉన్నా పంపించటం లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఎవర్ని అనుమతించేది లేదని పోలీసులు అంటున్నారు.

people facing problems in guntur dst bradipeta containment zone

author img

By

Published : Jul 14, 2020, 2:01 PM IST

గుంటూరు నగరంలోని బ్రాడిపేట కంటైన్మెంట్ జోన్ వద్ద రాకపోకలు నిలిపివేయటంపై స్థానికుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అధికారులు కంటైన్మెంట్ గా గుర్తించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రించారు.

నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ నుంచి బయటకి రాకపోకలు సాగించరాదు. దీంతో శంకర్ విలాస్ కూడలి వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన పోలీసులు... బ్రాడిపేటలోకి వాహనాలు రాకపోకలు సాగించకుండా నియంత్రిస్తున్నారు.

అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పాసులు ఉన్నా పంపించటం లేదు. దీంతో వారు కంట్రోల్ రూంలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరినీ పంపించటం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే తాము కోవిడ్ విధుల్లో ఉన్నా పంపించటం లేదని ఉద్యోగులు అంటున్నారు.

ఇదీ చూడండి

విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.