లాక్ డౌన్ నేపథ్యంలో రెండో రోజు ఉచిత రేషన్ కోసం గుంటూరు నగర వాసులు బారులు తీరారు. సర్వర్ నెమ్మదించి పంపిణీకి అంతరాయం కలిగిన కారణంగా.. ప్రజలు ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి ఎదురుచూస్తున్నా.. చాలాసేపు సరుకులు పంపిణీ చేయలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
రేషన్ కోసం పడిగాపులు... జిల్లా వ్యాప్తంగా కిక్కిరిసిన దుకాణాలు