power cuts : అసలే వేసవి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనాల్ని విద్యుత్ కోతలు...ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా కరెంట్ కోతలు విధించటంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో గంటలు తరబడి కరెంట్ కోతలు విధిస్తున్నారు. ముప్పాళ్ళ, నకరికల్లు, పెదకూరపాడు, వట్టిచెరుకూరు, మాచర్ల, తాడికొండ మండలాల్లో రాత్రి కాగానే కనీసం 2, 3 గంటలు కరెంట్ కోతలు తప్పనిసరిగా మారాయి. బాపట్లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు విద్యుత్ కష్టాలు తప్పటం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలోనూ అధికారులు.. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈఎల్‌ఆర్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని తెలిపారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..?