ETV Bharat / state

వారి వల్లే దేవాలయాలపై దాడులు: శైలజానాథ్ - ప్రభుత్వంపై శైలజానాథ్ కామెంట్స్

దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేకపోతుందో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో చంద్రబాబు, జగన్ కుమ్మక్కై.. రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆక్షేపించారు.

pcc president sailajanath comments on temple attacks
వారి వల్లే దేవాలయాలపై దాడులు
author img

By

Published : Jan 17, 2021, 3:11 PM IST

మతాన్ని రాజకీయానికి ముడిపెట్టి మాట్లాడే నాయకుల వల్లే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేకపోతుందో చెప్పాలన్నారు. దేవాలయాలపై దాడుల కారణంగా ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆకలిని అడ్డుపెట్టుకొని భాజపా వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీతో చంద్రబాబు, జగన్ కుమ్మక్కై.. రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ నెల 19న గవర్నర్​ను కలవనున్నట్లు వెల్లడించారు.

ఇదీచదవండి

చర్చిల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.