ETV Bharat / state

స్థిరాస్తి వ్యాపారం కోసమే విశాఖలో పరిపాలన: పవన్ కల్యాణ్

వైకాపాకు విశాఖపై ప్రేమ లేదని... కేవలం స్థిరాస్తి వ్యాపారం కోసమే విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
author img

By

Published : Jan 20, 2020, 9:59 PM IST

Updated : Jan 21, 2020, 9:42 AM IST

న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవటంపై జనసేనాని పవన్‌కల్యాణ్‌... ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట .... పవన్ కల్యాణ్‌, సోదరుడు నాగబాబు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గేట్‌ వద్ద నిలిపేసి... పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. పోలీసుల తీరును నాగబాబు ఖండించారు. మహిళలపై లాఠీఛార్జీ చేయటం దారుణమన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

వైకాపాకు విశాఖపై ప్రేమలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారం కోసమే విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారని విమర్శించారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్ పడగలు విప్పేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం నుంచి రాజధాని గ్రామాలకు వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. అమరావతిని తరలించడం సాధ్యం కాదన్న పవన్​.. రాజధానిని 5 కోట్ల మంది ఆమోదించాక తరలింపు అవసరమేంటని ప్రశ్నించారు. రాజధాని కదిలినా అది తాత్కాలికమే అని తెలిపారు. రాజధాని మార్పు నిర్ణయంతో వైకాపా వినాశనం మొదలైందని పవన్​ అన్నారు.

తమ వైఖరి ఎమ్మెల్యే రాపాకకు చెప్పినా... ఆయన వైకాపాకు మద్దతివ్వటం దారుణన్నారు. రాపాకపై పీఏసీ సభ్యులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జాతీయ స్థాయిలో బలమైన మార్పులు జరగబోతున్నాయని పవన్​ తెలిపారు.

ఇవీ చదవండి

రొంపిచర్ల పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా శ్రేణుల ధర్నా

Last Updated : Jan 21, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.