ETV Bharat / state

'నిందితులపై చర్యలు ఎప్పుడు... ?'

బాలికపై అత్యాచారం జరిపిన నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో అఘాయిత్యానికి బలైన బాలికకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

పంచుమర్తి అనురాధ
author img

By

Published : Nov 2, 2019, 11:14 AM IST

అత్యాచార నిందితులపై చర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా నేతల డిమాండ్​

గుంటూరు జిల్లా దాచేపల్లిలో అత్యాచారానికి గురై పిడుగురాళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా మహిళా నేతలు పరామర్శించారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఏం చేయాలో తెలియక ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారన్నారు. తెదేపా నేతలు స్పందించేవరకు అధికార పార్టీ స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటివరకూ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.
నిందితుడికి శిక్ష పడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నప్పటికీ.. ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. హోంమంత్రి సైతం నిందితుడిపై చర్యలు తీసుకోకుండా సమస్యను రాజీ చేసే ప్రయత్నం చేశారని అనురాధ విమర్శించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని.. బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ములక సత్యవాణి, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

చంద్రకళా... డెంగ్యూ ఎంత పని చేసిందమ్మా..?!

Intro:అత్యాచారానికి గురై పిడుగురాళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెలుగుదేశం మహిళా నేతలు శుక్రవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగి వారం రోజులు గడచినా కనీసం అధికార పార్టీగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకోవడం జరిగిందన్నారు. ఘటనపై టీడీపీ నేతలు స్పందించేవరకు అధికార పార్టీ స్పందించలేదని, ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అన్న భయంతో... ఆఘ మేఘాలపై స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మాట్లాడారే తప్ప ఇంతవరకు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనురాధ అన్నారు. 

Body:బాధిత కుటుంబ సభ్యులు నిందితుడికి శిక్ష పడాలని కోరుతున్నప్పటికి కూడా ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. ఘటనపై స్పందించిన హోంమంత్రి సైతం నిందితుడిపై చర్యలు తీసుకోకుండా సమస్యను రాజీ చేసే ప్రయత్నం చేశారని అనురాధ తెలిపారు. 

Conclusion:బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసాతోపాటు న్యాయం చేయాలని, బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ములక సత్యవాణి, ఆచంట సునీత, పానకాల వెంకటమహాలక్ష్మి, సుధాశశి   జిల్లా మైనార్టీ సభ్యుడు  అమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా నుండి వి. సైదాచారి ఈటీవీ న్యూస్ పిడుగురాళ్ల.9949449423.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.