ETV Bharat / state

'గృహ నిర్మాణ పథకంపై వైకాపాది తప్పుడు ప్రచారం'

వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి... తెదేపా పాలనపై విచారణ జరపడానికే శ్రద్ధ చూపిస్తోందని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

author img

By

Published : Jul 3, 2019, 4:51 PM IST

అనూరాధ
మీడియా సమావేశంలో అనురాధ

రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయలేని వైకాపా ప్రభుత్వం.... తెదేపా హయాంలో లేనేలేని అవినీతిపై విచారణ కోసం తొందరపడుతోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... ముఖ్యమంత్రి జగన్ కనీసం ఒక్కసారైనా విత్తనాల సమస్యపై సమీక్షించారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

తెదేపా హయాంలో గృహనిర్మాణ పథకంలో అవినీతి జరిగిందని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తుపాన్లు, భూకంపాలు తట్టుకునే సామర్థ్యంతో పాటు తక్కువ సమయంలో నిర్మించవచ్చనే ఉద్దేశంతోనే షీర్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించామని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులున్న మంత్రులకు అవినీతి నిర్మూలన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయం చేసినట్లు చెబుతున్న జగన్.... కీలక సమీక్షల్లో వారిని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోవటం లేదో చెప్పాలని నిలదీశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఐదో తరగతి విద్యార్థిని భుజంలోకి ఇనుప చువ్వ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జోగంపేట పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న దేవరశెట్టి లికిత అనే విద్యార్థిని బుధవారం ఉదయం యధావిధిగా పాఠశాలకు వెళ్లింది. అయితే పాఠశాల ముందు గేటు వేసి ఉండటంతో గేటు ఎక్కి లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసింది . ఈ దశలో ఆమె భుజానికి గేటు కు అమర్చిన ఇనుప చువ్వలు దూసుకెళ్లాయి . లిఖిత భుజం నుంచి ఇనుప చువ్వ బయటకు వచ్చింది. గేటుకు వేలాడుతున్న లిఖిత ను చూసిన స్థానికులు హుటాహుటిన యంత్రాలతో గేటు చివరలను కత్తిరించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ లిఖితకు శస్త్ర చికిత్స చేసి ఇ ఇనుపచువ్వను బయటకు తీశారు. కాగా తల్లి కాంచన మాత్రమే ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన లిఖితకు స్థానికులు కొంత ఆర్థిక సహాయం చేసి ఇ ఆదుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు లిఖిత నరకయాతన పడింది.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.