ETV Bharat / state

'ముందు నిధులు సమీకరించండి... తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాం'

పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. నిధుల లభ్యత చూపిస్తే ఆ తర్వాత అభ్యర్థిత్వం గురించి ఆలోచిద్దామని పలువురు నేతలు చెబుతున్నారు.

panchayath elections in guntur district
'ముందు నిధులు సమీకరించండి... తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాం'
author img

By

Published : Feb 5, 2021, 5:24 PM IST

నిధుల లభ్యత చూపిస్తే ఆ తర్వాతే అభ్యర్థిత్వం గురించి ఆలోచిద్దామని కొందరు నేతలు నమ్మబలుకుతుండగా మరికొన్ని చోట్ల ఆశావహులంతా కలిసి మీలో ఒకర్ని ఎంపిక చేసుకోండని సూచిస్తున్నారు. వైకాపా సానుభూతిపరులు ఎక్కువమంది ఉండటంతో వారిని ఎలా సముదాయించాలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు అంతుచిక్కటం లేదు. తెదేపా తరఫున కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు వ్యవహారాలు చక్కబెడుతుండగా, మరికొన్ని చోట్ల మండల నేతలే ఈ వ్యవహారాలు చూస్తున్నారు. అధికార పక్షం నుంచి జిల్లా ప్రధాన నాయకులు రంగంలోకి దిగారు.

● పెదకూరపాడులో ప్రస్తుతం ఓ అభ్యర్థి రూ.అరకోటి ఖర్చు చేయటానికి ముందుకొచ్చి ఆ మేరకు గ్రామంలో ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు దీటైన అభ్యర్థి కోసం వైకాపా తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే అన్వేషణ ప్రారంభించారు. ఇద్దరు ముందుకు రాగా వారిని ఎంతఖర్చు పెట్టగలరో ఆలోచించుకుని రావాలని సూచించినట్లు సమాచారం

● పేరేచర్లలో ఓ అభ్యర్థి తనకు అవకాశం వస్తుందని కూడలిలో ఉన్న ఓ స్థలాన్ని తాకట్టు పెట్టి నగదు సమకూర్చుకున్నారు. ఆ స్థలాన్ని రూ.50 లక్షలకు కుదువపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

● ఫిరంగిపురంలో పోటీ చేయటానికి అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి సోదరుడి బంధువు ఒకరు ఆసక్తి కనబరుస్తున్నారు. తాను రూ.అరకోటికి తగ్గకుండా వెచ్చిస్తానని ఇప్పటికే మాచర్లలో ఉన్న రెండెకరాల భూమి విక్రయించారు

● సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ గ్రామం నుంచి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి ఒకరు ఇప్పటికే గుంటూరులో తనకున్న ఓ అపార్టుమెంట్‌లో ప్లాట్‌ విక్రయించి రూ.40 లక్షలు సమకూర్చుకున్నారు

ఇదీ చదవండి:

'ఈ వాచ్​' యాప్​పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యం: నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.