పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి దినేశ్ కుమార్ సూచించారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో జేసీ ప్రశాంతి, ఎస్పీలు విశాల్ గున్నీ, అమ్మిరెడ్డితో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్దేశిత నిబంధలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. అభ్యర్థులకు అవసరమైన పత్రాలు జారీచేయటంలో, ప్రచారానికి అవసరమైన అనుమతుల మంజూరులో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నామినేషన్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చదవండి
'గవర్నర్ గారూ.. స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడండి'