ETV Bharat / state

'ఉప సర్పంచ్ పదవి కోసం వైకాపా నేతలు బెదిరిస్తున్నారు' - వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులకు పమిడిపాడు సర్పంచ్ ఫిర్యాదు

ఉప సర్పంచ్ ఎన్నిక విషయమై వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ.. గుంటూరు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు అందింది. తమకు రక్షణ కల్పించాలని.. నరసరావుపేట మండలం పమిడిపాడు సర్పంచ్ గౌసియా బేగం, వార్డు సభ్యులు రాంబాబు విజ్ఞప్తి చేశారు.

pamidipadu sarpanch complaint to district panchayati office on local ycp leaders
గుంటూరు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులకు పమిడిపాడు సర్పంచ్ ఫిర్యాదు
author img

By

Published : Mar 20, 2021, 4:33 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో.. తమను వైకాపా నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెదేపా వార్డు సభ్యులు వాపోయారు. సర్పంచ్ గౌసియా బేగం, వార్డు సభ్యులు రాంబాబు.. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నికలో మద్దతు తెలపాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. లేదంటే కేసుల్లో ఇరికిస్తామంటున్నారని ఆవేదన చెందారు.

వైకాపా నేతల బెదిరింపులతో.. ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు సైతం ముందుకు రావడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. పోలీసుల ద్వారా వార్డు సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తెదేపా మద్దతుదారు ఉప సర్పంచ్ కాకుండా వేదింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారితో పాటు మార్కెట్​ యార్డు ఛైర్మన్ హనీఫ్ నుంచి తమకు రక్షణ కల్పించి.. గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిపించాలని కోరారు.

ఇదీ చదవండి:

'పసుపు పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.