ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలన్నా...రైతులకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరు జిల్లా మార్క్ఫెడ్ విక్రయ కేంద్రంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన నాటినుంచి ఎదురు చూపులు తప్పడం లేదని అంటున్నారు.
ఇప్పటికే పేరు నమోదు చేసుకొని సరకు తెచ్చిన రైతుల వివరాలు, కొత్తగా పేరు నమోదు చేసేందుకు వచ్చిన రైతుల రిజిస్ట్రేషన్లను సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పేరు నమోదు కోసం ఉదయం వచ్చిన రైతులు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇతర మండలాల నుంచి వచ్చిన రైతులు పేరు నమోదు చేయించుకొని తిరిగి వెళ్లాలంటే చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.