గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో పోలీసులు అపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. గ్రామంలోని శ్రీలలితా స్పిన్నింగ్ మిల్లు, గజవల్లి స్పిన్నింగ్ మిల్లు, గోదావరి స్పిన్నింగ్ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. మూడు మిల్లులో కలిపి 35 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశా నుంచి వలస వచ్చిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకొని స్వగ్రామాలకు తరలించనున్నారు.
ఇదీచదవండి