ETV Bharat / state

నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ ఆరామ క్షేత్రం ప్రారంభం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ ఆరామ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి

author img

By

Published : Mar 26, 2021, 10:24 PM IST

నరసరావుపేటలోని నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ ఆరామ క్షేత్రాన్ని మంత్రి పేర్ని నాని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. అంతకుముందు స్థానిక వైకాపా కార్యాలయం నుంచి ఆరామక్షేత్రం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాపులకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డికే దక్కుతుందని అభివర్ణించారు.

అభివృద్ధి, సంక్షేమ పాలనతో వైకాపా గొప్ప విజయాన్ని పొందిందన్నారు. కాకి లెక్కలు చెబుతూ, అసత్య ప్రచారాలు చేసిన ప్రతిపక్షాలు చతికిలబడ్డాయని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అమరావతిలోనూ నిరసన హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.