గుంటూరు జిల్లా మాచర్లకు కరోనా వైరస్ తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 75 వరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు, పలు రకాల వైద్య సేవలు అందించే మాచర్ల ప్రభత్వ ఆసుపత్రిలో కలకలం మొదలైంది. ఇక్కడ పనిచేసే వైద్యునితో పాటు ఇద్దరు వైద్య సిబ్బందికీ కరోనా లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆస్పత్రిలో వైద్య సిబ్బందిలో భయాందోళన మొదలైంది. అప్రమత్తమైన ఆస్పత్రి వైద్య సిబ్బంది బుధవారం నుంచి ఆస్పత్రిలో ఓపి సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందించనున్నట్లు వెద్యులు పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు మరోసారి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇవీ చూడండి...