గుంటూరు జిల్లా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర చికిత్స సేవలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నామమాత్రపు చికిత్సకు మాత్రమే 30 పడకల ఆసుపత్రి పరిమితం కావటంతో.... వైద్యం సకాలంలో అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లిఫ్ట్ నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం అవతున్న మారెళ్ళ ఎలమందా రెడ్డిని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. శ్వాస అందక సుమారు గంట పాటు ఆసుపత్రి స్ట్రక్చర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా... చికిత్స అందించాల్సిన వైద్యులు పారిశుద్ధ్య కార్మికురాలితో తలకు కట్టు కట్టించారు. అంతేగాక శ్వాస అందక ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందించకపోవటంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి