నెల్లూరు జిల్లా సంగం అరవపాలెం వద్ద పెన్నా నది నుంచి ప్రవహిస్తున్న సదరన్ ఛానల్ కాలువలో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్దానికులు రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతను మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చెేరుకున్నారు. మృతుడు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: