Installation of statue of BP Mandal : గుంటూరులోని అమరావతి రోడ్డులో బీపీ మండల్ విగ్రహ ఏర్పాటును పట్టణ ప్రణాళిక అధికారులు అడ్డుకున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నాలుగు నెలల క్రితం విగ్రహ ఏర్పాటుకు దిమ్మె నిర్మించగా.. అనుమతి లేదని నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. దీంతో బీసీ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనల ఆనంతరం.. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో విగ్రహ ఏర్పాటుపై తీర్మానం ఆమోదించారు. దీంతో బీసీ సంఘాల నేతలు శనివారం పనులు ప్రారంభించగా.. కొద్దిసేపటికే అధికారులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో బీసీ సంఘాల నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే పనుల్ని నిలిపివేయటంపై మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత పనులు ఎలా నిలిపి వేస్తారని అధికారులను ప్రశ్నించారు.
ఇవీ చదవండి :