ETV Bharat / state

గుంటూరులో కరోనా నియంత్రణకు అధికారుల సమీక్ష - గుంటూరులో కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు 18వేలు దాటాయి. సోమవారం రోజు కొత్తగా 573 కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 151 కి చేరింది. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షించారు. వైరస్ బారిన పడినవారు అఖరి నిమిషంలో ఆసుపత్రులకు చేరుకుంటుండటంతో మరణాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ రోగులకు ప్లాస్మా చికిత్స అందించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.

officials held review meeting as corona cases are increasing in district
గుంటూరులో కరోనా నియంత్రణకు అధికారుల సమీక్ష
author img

By

Published : Aug 4, 2020, 7:33 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య 18, 868కి చేరుకుంది. సోమవారం ఒక్కరోజే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 257 కేసులు నమోదయ్యాయి. అలాగే నర్సరావుపేట 43, సత్తెనపల్లి 40, పిడుగురాళ్ల 34, మాచర్ల 29, బాపట్ల 21, మంగళగిరి 18, దాచేపల్లి 14, తెనాలి 14, మేడికొండూరు10, వట్టిచెరుకూరులో 10, పిట్టలవానిపాలెం 9 కేసులు వచ్చాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 71 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 10వేల మంది కోలుకున్నారు. దాదాపు 3వేల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో 60శాతం మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జిల్లాలో కరోనా నియంత్రణ, రోగులకు చికిత్సకు సంబంధించి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వైరస్ బారిన పడిన తర్వాత... పరిస్థితి తీవ్రరూపం దాల్చాక కొందరు ఆసుపత్రులకు వస్తున్నారని... అలాంటి వారే మరణిస్తున్నారని కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ తెలిపారు. అలాంటి వారిని గుర్తించేందుకు కంటైన్మెంట్ జోన్లు, నాన్ కంటైన్మెంట్ జోన్లలో అధిక రిస్క్ ఉన్నవారిని గుర్తించి పల్స్ ఆక్సీమీటర్​తో రోజుకు రెండు సార్లు తనిఖీ చేయాలని వాలంటీర్లకు ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాల కంటే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులలో బెడ్ల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షించాలని, పాజిటివ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా ఆసుపత్రులు, పడకలను పెంచాలని ఆయన సూచించారు. కరోనా చికిత్సకు వినియోగించే ప్రాణ రక్షక మందులతో పాటు ఇతర మందుల స్టాకుని ప్రతి రోజు సరిచూడాలన్నారు.

జిల్లాలో ప్లాస్మా థెరఫీ చికిత్సకు సంబంధించి అనుమతుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్లాస్మా సేకరణ, రోగులకు చికిత్సకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్​తో మృతి చెందిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు 24 గంటల్లోగా తెలియజేయాలని ఆయా ఆసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులు రాకపోతే వారి అంగీకారం తీసుకుని మృత దేహాలకు 48 గంటలలో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. గుంటూరులో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే శ్మశాన వాటిక సామర్థ్యం పెంపు కోసం కోనేరు శ్రీవిద్య అనే మహిళ ముందుకు వచ్చారు. తనతో పాటు మరి కొందరు స్నేహితుల ద్వారా రూ.11లక్షలు సేకరించి... చెక్కుని జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్​కు అందజేశారు. ఈ డబ్బుతో స్తంభాలగరవులోని మహాప్రస్థానంలో గ్యాస్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ మృత దేహాలకు గ్యాస్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇక్కడే తొలిసారి కానుంది. అందుకు నాంది పలికిన డాక్టర్ కోనేరు శ్రీవిద్యను దినేష్ కుమార్ అభినందించారు.

ఇదీ చదవండి:

నకిలీ ఔషధాల నియంత్రణకు ప్రత్యేక విభాగం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.