ETV Bharat / state

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు... నివారణ చర్యల్లో నిమగ్నమైన అధికారులు - guntur latest news

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కేసుల నియంత్రణకు సమీక్ష నిర్వహించిన అధికారులు... జీజీహెచ్​తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్​కు చికిత్స అందించాలని నిర్ణయించారు. జిల్లాలో రోజూ 60వేల మందికి కరోనా టీకాలు అందిస్తున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడించారు.

black fungus cases in guntur district
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
author img

By

Published : May 28, 2021, 10:00 PM IST

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల నియంత్రణపై అధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొవిడ్ కట్టడికి చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. కర్ఫ్యూ అమలవుతున్న తీరు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. జీజీహెచ్​తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స అందించాలని, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.

కొవిడ్ బాధితులకు సమస్యలు తలెత్తకుండా వైద్యారోగ్యశాఖతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, నోడల్ అధికారులు పని చేస్తున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. రోజూ 60వేల మందికి కొవిడ్ టీకా అందిస్తున్నట్లు వివరించారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 150 మందికి చికిత్స అందించేలా జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటు ఎన్ఆర్ఐ, కాటూరి ఆసుపత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీచదవండి.

బైక్ దొంగల ముఠాలు అరెస్టు... 36 ద్విచక్రవాహనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.