గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండింగ్ ఆఫీసర్ ఎం. మోహన్ రావు(62) మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. హైదరాబాద్లోని ఆస్పత్రిలో మరణించారు. సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండర్ పలువురు అధికారులు.. ఆయన మృతదేహంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు.
దేశంలోని పలు ప్రాంతాలలో ఎయిర్ ఫోర్స్ విభాగంలో మోహన్ రావు వివిధ కేడర్లలో పనిచేశారు. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండింగ్ ఆఫీసర్ 44 ఈడీగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య రత్న , కుమారుడు అభిషేక్ ఉన్నారు. ఈవూరివారిపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులంతా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: స్వస్థలాలకు చేరుకున్న అమర జవాన్ల పార్థివదేహాలు