ETV Bharat / state

పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది.. ఎన్టీఆర్ : తెదేపా నేతలు

NTR Statue Inauguration: ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది అని తెదేపా నేతలు కొనియాడారు. గుంటూరు జిల్లా కుంకలగుంటలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయడు, జీవీ ఆంజనేయులు ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది

author img

By

Published : Jan 9, 2022, 4:13 PM IST

NTR Statue Inauguration At Kunkalagunta: గుంటూరు జిల్లా కుంకలగుంటలో ఏర్పాటు చేసిన.. 12 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయడు, జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది అని రామానాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. చెత్త మీద పన్ను వేసిన ఏకైక సీఎం జగన్‌ అని రామానాయుడు దుయ్యబట్టారు. ధాన్యం గురించి అడిగితే రైతులను జైలుకు పంపిస్తున్నారన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఏదీ అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధి, ఉద్యోగం లేక యువత అల్లాడిపోతున్నారన్నారు.

ఎన్టీఆర్ జీవితమే ఓ ప్రభంజనమని పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఎన్టీఆర్‌కు ఓ కులాన్ని ఆపాదించడం సరికాదని హితవు పలికారు. కులాల పేరుతో గ్రామాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు వన్​టైమ్ సెటిల్‌మెంట్‌ చేయబోతున్నారని ఎద్దేవా చశారు.

సాగు సహా అన్ని రంగాలనూ చంద్రబాబు అభివృద్ధి చేశారని జీవీ ఆంజనేయులు అన్నారు. ధాన్యం సమస్యపై అడిగిన రైతును వైకాపా ఎమ్మెల్యే బెదిరించారని ఆరోపించారు. వైకాపా అరాచకపాలనకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చదవండి :

Ring Nets Issue: రింగు వలల సమస్యపై మంత్రుల సమావేశం.. 144 సెక్షన్​ ఎత్తివేస్తూ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.