ETV Bharat / state

వ్యాక్సిన్ లేదని బయట బోర్డులు... లోపల కొందరికి టీకాలు! - vaccination in guntur district

ఈ నెల 31 వరకు శాశ్వత కేంద్రాల ద్వారా కరోనా రెండో డోస్ టీకా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన రెండు మూడు రోజుల్లోనే... వ్యాక్సిన్ లేదంటూ బోర్డులు పెట్టడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యాక్సిన్ లేదని బోర్డులు పెట్టి... లోపల కొంతమందికి టీకా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

no vaccination boards at  tenali
వ్యాక్సిన్ లేదని బయట బోర్డులు
author img

By

Published : May 13, 2021, 5:26 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాశ్వత కేంద్రాల బయట 'ఈరోజు వ్యాక్సిన్ లేదు' అనే బోర్డులు కనిపిస్తున్నాయి. బయట లేవని బోర్డులు పెట్టినా... కేంద్రాల లోపల కొందరికి స్లిప్పులు ఇచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారని టీకా కోసం వచ్చిన ప్రజలు ఆరోపిస్తున్నారు. తమకు టీకా వేయకుండా కొందరికే వేయడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. రెండో డోస్ కోసం సమయం మించిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి: ముఖ్యమంత్రికి లోకేశ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.