ETV Bharat / state

జగన్‌ పాలనలో అడ్డగోలుగా వైఎస్సార్ విగ్రహాలు- ట్రాఫిక్ సమస్యతో ప్రజల పాట్లు - విగ్రహాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు

No Rules for YSR Statues in Andhra Pradesh: అస్మదీయులు అయితే నిబంధనలు నిశ్శబ్దం పాటించాలంతే. అనుమతులా అసలు అక్కర్లేదు. న్యాయస్థానాల తీర్పులు తెల్లబోవాల్సిందే. అక్రమాలు సక్రమమవుతాయి. ప్రజా ప్రయోజనాలు పక్కకు వెళ్లిపోతాయి. ఈ పరిస్థితి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల ఏర్పాటులో మరోసారి కళ్లకు కడుతోంది. ఆయన విగ్రహాలు ఏర్పాటుకు రాష్ట్రంలో నిబంధనల ఏమాత్రం అడ్డురావడం లేదు. వైఎస్‌ఆర్‌ తనయుడి పాలనలో అడ్డగోలుగా ఆయన ప్రతిమల ఏర్పాటు సాగుతోంది. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. ఈటీవీ భారత్-ఈనాడు 234 విగ్రహాలను పరిశీలించగా వాటిలో 115 విగ్రహాలకు అసలు అనుమతులే లేవంటేనే విగ్రహాల ఏర్పాటు రాజకీయం ఎంత యథేచ్ఛగా సాగుతోంది అర్థం చేసుకోవచ్చు.

No_Rules_for_YSR_Statues_in_Andhra_Pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 7:26 AM IST

No Rules for YSR Statues in Andhra Pradesh: జగన్‌ పాలనలో అడ్డగోలుగా వైఎస్సార్ విగ్రహాలు- ట్రాఫిక్ సమస్యతో ప్రజల పాట్లు

No Rules for YSR Statues in Andhra Pradesh: ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇచ్చినా, ఆ వెంటనే ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎస్‌ స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ప్రస్తుత వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి అవేవీ పట్టడం లేదు. అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వీధి వీధినా వైఎస్‌ విగ్రహాలను సీఎం జగన్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసేస్తున్నారు.

అధికారులు కనీసం నోటీసులిచ్చే ప్రయత్నమూ చేయడం లేదు. సీఎం జగన్‌ కడపలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లే మార్గంలో అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించారు. స్పీకర్‌ తమ్మినేని తన సొంత నియోజకవర్గం అమదాలవలస 3 రోడ్ల కూడలిలో రాత్రికి రాత్రి YSR (YS Rajasekhara Reddy) విగ్రహం ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యకు ఆజ్యం పోశారు. ఇదేవిధంగా మిగిలిన వైఎస్సార్​సీపీ నేతలూ ఊరూ వాడా వైఎస్‌ విగ్రహాలతో నింపేస్తూ..ప్రజలను ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు

Traffic Problems due to YS Rajasekhara Reddy Statues: సీఎం జగన్‌ సొంత జిల్లా కేంద్రమైన కడప వైఎస్సార్ విగ్రహాలతో నిండిపోతోంది. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ చిక్కులతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కడప నుంచి పులివెందుల వెళ్లే మార్గంలోని ప్రధాన కూడలిలో, కడప-తిరుపతి బైపాస్‌ రోడ్డులో భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఔటర్‌ రింగురోడ్డులోని ప్రతి కూడలిలోనూ దర్శనమిస్తున్నాయి. మోచంపేట, శంకరాపురం, అంగడివీధి ప్రాంతాల్లో రహదారుల మధ్యలో ఏర్పాటైన విగ్రహాలతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. కో-ఆపరేటివ్‌ కాలనీలో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో దిమ్మె కట్టి విగ్రహాన్నిపెట్టారు. మరియాపురం కమ్యూనిటీ హాల్, యానాది కాలనీ, శివానందపురం ప్రాంతాల్లో అనధికారికంగా విగ్రహాలు నెలకొల్పారు.

30 లక్షల నగరపాలక సంస్థ ఖర్చుతో: విజయవాడ నగరాన్ని వైఎస్సార్ విగ్రహాల మయంగా చేస్తున్నారు. భవానీపురం క్రాంబే రోడ్డు శివాలయం కూడలిలో 15 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వడం కుదరదని నగరపాలక సంస్థ అధికారులు చెప్పినా వైఎస్సార్​సీపీ నేతలు వినలేదు. చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. పోలీస్‌ కంట్రోల్‌రూం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులతో గత ప్రభుత్వ హయాంలో తొలగిస్తే వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక అవతార్‌ పార్కులో తిరిగి ఏర్పాటు చేశారు. 30 లక్షల ఖర్చును నగరపాలక సంస్థ నెత్తిన వేశారు. కార్పొరేషన్‌ నిధులతోనే విగ్రహానికి రంగులు అద్దారు.

అధికారుల్లో చలనం లేదు: విశాఖలో వైఎస్సార్​సీపీ పాలనలో 8 వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. భీమునిపట్నం, కొమ్మాదిలోని 2 విగ్రహాలకు జీవీఎంసీ అనుమతులు లేవు. 2014కి ముందు తగరపువలస ప్రధాన కూడలి వద్ద, బైపాస్‌ కూడలిలో రహదారుల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. విశాఖ నగర పరిధిలో అన్ని రకాలు కలిపి 68 విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో బీచ్‌ రోడ్డులో 28 వరకు ఉండగా చాలావాటికి అనుమతుల్లేవు. శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు.

అక్కడ కూడా వైఎస్సార్​ విగ్రహమే.. మరి ఎవరిది తీశారో తెలుసా??

వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్య: కర్నూలు ఆర్​ఎస్ రహదారిలోని ఎస్​బీఐ కూడలిలో పదేళ్ల క్రితం ఏర్పాటైన వైఎస్‌ విగ్రహంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సమస్యను పరిష్కరించకపోగా అదే విగ్రహానికి 7 లక్షలతో మరిన్ని హంగులు దిద్ది వాటర్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేశారు. వేల మంది ప్రయాణించే దారి కావడంతో ట్రాఫిక్‌ సమస్యలు మరింత పెరిగాయి. శరీన్‌నగర్‌లో రహదారి మధ్యలో ఉన్న వైఎస్‌ విగ్రహంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగర మేయర్, ఎమ్మెల్యే అధికార వైఎస్సార్ సీపీకి చెందిన వారు కావడంతో అధికారులు సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు.

ఏకంగా జాతీయ రహదారిపై: తిరుపతిలో వైఎస్సార్​సీపీ పాలనలో అనుమతులు తీసుకోకుండా 2 వైఎస్‌ విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్విమ్స్‌ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఒకటి, వైఎస్‌ఆర్‌ బృహత్తర ప్రణాళిక రోడ్డు వద్ద మరో విగ్రహం నెలకొల్పారు. చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన వీటిపై బాధ్యులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. అనంతపురం జిల్లాలో అనుమతులు తీసుకోకుండా ఏకంగా జాతీయ రహదారిపై వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. బుక్కరాయసముద్రం చెరువుకట్ట రోడ్డు, అనంతపురం-తాడిపత్రి రహదారి కలిసే కూడలి వద్ద నెలకొల్పిన విగ్రహంతో చెరువు కట్ట పైనుంచి వచ్చే వాహనదారులకు అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కనపడవు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఈ విగ్రహం ప్రారంభించారు. అధికారుల కిమ్మనకుండా ఉన్నారు.

ప్రయాణికులు ఇబ్బందులు: గుంటూరు నగర పరిధిలో 20కి పైగా వైఎస్‌ విగ్రహాలు ఉన్నాయి. వీటిలో చాలావాటికి అనుమతులు లేవు. జగన్‌ పాదయాత్ర సమయంలో ఎక్కువగా వీటిని ఆవిష్కరించారు. లాడ్జి సెంటర్ నుంచి గోరంట్ల వరకు ఉన్న మూడు కిలోమీటర్ల దూరంలో 8 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలన్నీ చౌరస్తా, యూ టర్న్ పాయింట్లు, డివైడర్లు మీదనే ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాల ఏర్పాటు వల్ల రహదారి ఇరుక్కుగా మారడంతో రద్దీ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

'వీసీ పదవీకాలం పొడిగించుకునేందుకు వర్సిటీలో వైఎస్ విగ్రహం' - ఏఐఎస్​ఎఫ్​ నిరసన

హైకోర్టు ఆదేశించినా: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు విగ్రహాలు పెట్టాలంటే విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ఇవేమి పట్టించుకోకుండా వైఎస్ఆర్ విగ్రహం పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న కాజా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలోనూ వైఎస్ఆర్ బొమ్మ పెట్టడంపై అభ్యంతరాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపైనా మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా ఇటీవలే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశించినా నరసరావుపేటలోని మయూరి లాడ్జి కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం తొలగించకుండా అధికారుల మీనమేషాలు లెక్కిస్తున్నారు.

చెరువును కూడా వదల్లేదు: ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లు తొలగించి ఆ స్థానంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విగ్రహం ఆవిష్కరించకుండా వదిలేశారు. ఇక్కడ పొడవైన లారీలు, బస్సులు మలుపు తిరగడం కష్టమవుతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను తొలగించడంతో వాహన రాకపోకలు నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది అవస్థ పడుతున్నారు. రొంపిచర్లలో అనుమతి లేకుండా అర్ధరాత్రి హడావుడిగా వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇరుకైన మార్గం కావడంతో దుకాణదారులు, స్థానికులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. తాజాగా అంకిరెడ్డిపాలెంలో చెరువు అభివృద్ధి చేసి దాని మధ్యలో ఏర్పాటు చేస్తున్న వైఎస్‌ విగ్రహానికీ అనుమతులు లేవు.

YSR Statues in Andhra Pradesh: ఒంగోలులోని ఒంగోలు-కర్నూలు రహదారిలో సమతా నగర్‌ వద్ద రోడ్డు మధ్యలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మె ట్రాఫిక్‌కు పెద్ద సమస్యగా మారింది. హైకోర్టు స్టే ఇచ్చినా అధికారులు దిమ్మె తొలగించడం లేదు. ఏలూరులో 2019 తరువాత 15 విగ్రహాలు ఏర్పాటు కాగా చాలావాటికి అనుమతులు లేవు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనూయాయులు అనుమతులు తీసుకోకుండా YSR విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

మహాత్ముని విగ్రహం తొలగించి: రహదారిని ఆక్రమించి పార్వతీపురంలో పునరావిష్కరించిన వైఎస్‌ విగ్రహంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. మార్గ సూచిక బోర్డు కూడా తొలగించారు. విగ్రహం పెట్టేందుకు ఎక్కువ స్థలంలో దిమ్మను కట్టడంతో మూడు రోడ్ల కూడలి ఇరుకుగా మారింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ గాంధీ సెంటర్‌లో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్నాయంటూ గాంధీ మహాత్మునితోపాటు పలువురు ప్రముఖుల విగ్రహాలను అధికారులు తొలగించారు. కానీ వైఎస్‌ విగ్రహం జోలికి మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలోని విగ్రహాలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేదు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వర్సిటీ నిధులు 5 లక్షలు వెచ్చించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై వివాదం చెలరేగగా ప్రస్తుతానికి ప్రారంభించలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.