ETV Bharat / state

‘ఎయిమ్స్‌’కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం.. నీటి సరఫరాకు కొర్రీలు - ఎయిమ్స్‌

AIIMS : పేదలకు ఉన్నత వైద్యమే ప్రభుత్వ లక్ష్యమని, వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్‌ తన ప్రసంగాల్లో తరుచూ చెబుతూ ఉంటారు. విభజన అనంతరం రాష్ట్రంలో పెద్దాసుపత్రులు లేకుండా పోయాయని వాపోతుంటారు. మంగళగిరిలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌కు రోజువారీ అవసరాలకు తగినట్లుగా నీటిని అందించలేకపోతున్నారు. సరఫరా ఖర్చును భరించాలంటూ బేరాలు సాగిస్తూ ఆసుపత్రికి చుక్కలు చూపిస్తున్నారు. ఎయిమ్స్‌లో తగిన నీటి వసతి లేని కారణంగా రోగులను చేర్చుకోలేని దుస్థితి నెలకొంది.

AIIMS
AIIMS
author img

By

Published : Sep 26, 2022, 8:28 AM IST

AIIMS : గుంటూరు జిల్లా మంగళగిరిలో 16 వందల18 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌కు 2015 డిసెంబరులో శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12 నుంచి సేవలు మొదలయ్యాయి. అత్యాధునిక నిర్మాణాలు, వసతులతో రూపుదిద్దుకుంటున్న ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఈ ఆసుపత్రికి రోజుకు 15 నుంచి 20 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 2 నుంచి 3 లక్షల లీటర్లను మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు ఉచితంగా అందిస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రికి తెచ్చేందుకు నెలకు 5 లక్షల ఖర్చును ఎయిమ్స్‌ భరిస్తోంది.

మరో మూడు లక్షలు అధనంగా ఇవ్వాలని లేఖలు : ఓపీ ద్వారా రోజూ 15 వందల మంది వరకు వైద్యం పొందుతున్నారు. 950 వరకు ఇన్‌పేషంట్‌ పడకల ఏర్పాటుకు అవకాశముంది. అయితే.. 125 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణాలకు తగ్గట్లు 400 పడకలను అదనంగా వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఎంబీబీఎస్‌లోనూ సీట్లు పెరిగాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పీజీ, నర్సింగ్‌లోనూ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా రోజు మరో 3 లక్షల లీటర్ల నీటిని అదనంగా ఇవ్వాలని ఎయిమ్స్‌ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, కార్పొరేషన్‌ కమిషనర్ల స్థాయి వరకు కొద్దికాలంగా లేఖలు రాస్తూనే ఉన్నారు.

అదనంగా 3 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెలుపలి నుంచి ఇవ్వాల్సి ఉన్నందున చెల్లింపులు జరగాల్సిందేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తొలుత పేర్కొన్నట్లు రోజుకి 72 వేల 162 కాకున్నా.. కనీసం సాధారణ స్థాయిలోనైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం రోజుకి 35వేల వరకు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి వస్తుందని తెలిసింది. ఈలెక్కన చెల్లింపులు జరిపి, నీటిని మంగళగిరి ఎయిమ్స్‌కు ట్యాంకర్ల ద్వారా తెప్పించేందుకు నెలకు అదనంగా మరో 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.

ఎయిమ్స్​ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్న రాష్ట్రం : రాష్ట్రానికి ఎయిమ్స్‌ వస్తుంటే.. రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికి.. అవసరమైన నీరు, రోడ్డు, ఇతర కనీస సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రులు భారతీ పవార్, నారాయణస్వామి ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎయిమ్స్‌ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అదనంగా మరో 3 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా అందచేయాలని కేంద్ర మంత్రి మాండవీయ 2022 జులై 28న ముఖ్యమంత్రి జగన్‌కు స్వయంగా లేఖ రాశారు. ఉచితంగా నీటిని ఇవ్వలేం. ధర మాత్రం తగ్గిస్తాం’ అని 2022 సెప్టెంబరు 2న పురపాలకశాఖ చెప్పింది.

ఎయిమ్స్‌కు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరిగితేనే సమస్య పరిష్కారం దొరుకుంది . తెనాలి రోడ్డులోని మంగళగిరి ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నుంచి నీరిచ్చేందుకు 2018లో తొలి ప్రతిపాదన చేశారు. భవిష్యత్తులో మంగళగిరికి నీటి సమస్య వస్తుందన్న అభ్యంతరాలతో అది మరుగునపడింది. ఉండవల్లి నుంచి తెనాలి వరకున్న పైపులైను నుంచి నీటిని తీసుకోవాలనే రెండో ప్రతిపాదన తెచ్చారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనా కనుమరుగైంది.

చివరికి.. మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆత్మకూరు సమీపంలోని 80 ఎకరాల చెరువు నుంచి నీటిని తరలించేందుకు టెండరు పిలిచారు. త్వరలో సంస్థను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణానికి వచ్చే మార్గంలో 0.42 హెక్టార్ల అటవీ భూమిని ఎయిమ్స్‌కు ఇంకా బదలాయించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.