జీఎంసీ కార్యాలయంలోని అన్ని వార్డు సచివాలయ సెక్రటరీలతో కమిషనర్ చల్లా అనురాధ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించేలా అవగాహన పెంచాలని సూచించారు. ఇప్పటికే మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామని అన్నారు.
మహిళా పోలీసులు వారి సచివాలయ పరిధిలోని దుకాణాల వద్ద... మాస్క్ ధరించకుండా వచ్చే వారిని షాపులలోకి ప్రవేశించనీయకుండా చూడాలన్నారు. దుకాణాల యజమానులు, సిబ్బంది కూడా మాస్క్ లు, హ్యాండ్ గ్లౌజ్ లు, శానిటైజర్ విధిగా వాడేలా తగిన చర్యలు తీసుకోవలన్నారు.
ఇదీ చదవండి: