Liquor Sales in Telangana : తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆరు రోజుల్లో రూ.11 వందల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. డిసెంబర్ నెలలో ఏకంగా రూ.3,376 కోట్లు విలువైన మద్యాన్ని మద్యం ప్రియులు తాగేశారు. డిసెంబరు 26వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఏకంగా రూ.1111.29 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. ముందుగానే మద్యాన్ని దుకాణదారులు, బార్ అండ్ రెస్టారెంట్లు స్టాక్ తెచ్చి సిద్దంగా ఉంచుకున్నాయి.
2021 డిసెంబరు 31వ తేదీన కేవలం రూ.171.93 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా.. 2022 డిసెంబరు 31న రూ.216 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబరు చివరి వారంలో చోటుచేసుకున్న మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే 26వ తేదీన రూ.182.28 కోట్లు, 27వ తేదీన రూ.155.29 కోట్లు, 28వ తేదీన రూ.144.79 కోట్లు, 29వ తేదీన రూ.159.14 కోట్లు, 30వ తేదీన శుక్రవారం ఒక్క రోజునే అత్యధికంగా రూ.254 కోట్లు విలువైన మద్యం అమ్మకం జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాల్లో, 1 గంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు ఆబ్కారీ శాఖ అనుమతివ్వడంతో మద్యం ప్రియులు రెచ్చిపోయారు. 2022 డిసెంబరు చివరి వారంలో రోజుకు సగటున రూ.185.21 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.70 నుంచి రూ.80 కోట్ల విలువ గల మద్యం మాత్రమే అమ్ముడుపోయేది. సెలవు దినాల్లో అయితే అది రూ.వంద కోట్ల వరకు చేరేది. కానీ నూతన సంవత్సరం సందర్భంగా నెల చివరి వారంలో ఏకంగా రోజుకు రూ.185 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోవడం గమనార్హం.
ఇవీ చదవండి: