New Year celebrations in Andhra Pradesh: రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అర్థరాత్రి నుంచి ఆటపాటలతో చిన్నాపెద్దా సందడి చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ యువత జోష్‌లో తేలియాడింది. కొత్త సంవత్సరం కోసం యువతి యువకులు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజలు కొత్త ఏడాదిని కొంగొత్తగా ఆహ్వానించారు. గుంటూరులో ఆంగ్ల సంవత్సరాదిని ఘనంగా జరుపుకున్నారు. యువతీ యువకులు రహదారులపై కేక్‌లు కట్ చేసి, ఆత్మీయులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కమ్మ సేవా సమతి ఆధ్వర్వంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు. ఆలనాటి నుంచి నేటి సూపర్ హిట్ చిత్రాల గీతాలకు నృత్యాలు చేశారు. అర్ధరాత్రి కేక్ కట్ చేసి, కొత్త ఏడాదిని ఆహ్వానించారు.
కళ్లు చెదిరే సెలబ్రేషన్స్‌తో 2024కు స్వాగతం- ఈ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!
విజయవాడలో భవిష్య జూనియర్ కళాశాల విద్యార్థినులు నూతన సంవత్సర వేడుకలకు కొత్త సందడిని అద్దారు. ఉపాధ్యాయినులు వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాజమహేంద్రవరంలో కొత్త ఏడాది జోష్ కనిపించింది. యువత ఉరిమే ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ..సందడిగా గడిపారు. విశాఖ బీచ్ నగర వాసులతో కిక్కిరిసింది. న్యూయర్ మరింత నూతనంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెబుతూ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిన్న, పెద్దా అంటూ తేడాలేకుండా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలో రోడ్లపైకి వచ్చిన యవకులు హల్ చల్ చేశారు. ఏ వన్ ఫంక్షన్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నగరంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.
'ప్రజల్లో 'వికసిత్ భారత్' స్ఫూర్తి- నాటునాటుకు ఆస్కార్‌తో దేశమంతా ఫుల్ ఖుషీ'
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2023 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికిన నగర వాసులు 2024కి అదిరే ఆరంభమిచ్చారు. అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద యువకులు సందడి చేశారు. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కేకుల కట్ చేశారు. కర్నూలులో రాజ్ విహర్ కూడలి వద్ద కొత్త ఏడాదిని కొంగొత్తగా ఆహ్వానించారు. రోడ్లపై కేకులు కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పోలీసులూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలను యువత సందడిగా చేసుకున్నారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద యువత కేరింతలు వేస్తూ, కేకుల కొస్తూ నృత్యాలు చేశారు. ఒకరికి ఒకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరపాలకాధికారులు టవర్ క్లాక్ ను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ విద్యుత్ కాంతుల వెలుతురులో యువత సందడి ఆకట్టుకుంది. పోలీసులు యువతను అదుపు చేయాలని చూశారు. అయితే, యువత పెద్ద సంఖ్యలో రావడంతో అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యువతి యువకులు ఏమాత్రం తగ్గకుండా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.