ETV Bharat / state

జిల్లాలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి... కొత్తగా 364 మందికి పాజిటివ్

గుంటూరు జిల్లాలో కొవిడ్-19 వ్యాప్తి మళ్లీ పెరిగింది. ఇవాళ మరో 364 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. అత్యధిక కేసులు గుంటూరు నగరంలోనే నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.

new 364 corona cases confirmed in guntur
జిల్లాలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి... కొత్తగా 364 మందికి పాజిటివ్
author img

By

Published : Nov 8, 2020, 8:04 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. కొత్తగా 364 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 70వేల 750కు చేరినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 73 నిర్ధరణ అయ్యాయి. తెనాలిలో 27 కేసులు, తాడేపల్లి 22, మంగళగిరిలో 19, నరసరావుపేటలో 17, బాపట్లలో 15, రేపల్లెలో 11, చిలకలూరిపేట, తుళ్లూరు, సత్తెనపల్లిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాల్లోని కేసుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 66వేల 162మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ బారినపడి ఇవాళ ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 631కు చేరింది. కొవిడ్​తో మరణించిన వారి సంఖ్యలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 2,237 కరోనా కేసులు.. 12 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.