మొదటి జాతీయ స్థాయి పద్య, నాటక పోటీలు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవ కార్యక్రమాలు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి లక్ష రూపాయల పారితోషికం, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, రజత వీణ.. తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ. 50 వేలు..కాంస్య వీణతో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
గౌరీ శంకర నాట్యమండలి ఐలవరం 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' నాటక ప్రదర్శనతో తొలి నాటక ప్రదర్శనాన్ని ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ 'అల్లసాని పెద్దన' పద్య నాటకం ప్రదర్శించనున్నారు.
ఇదీ చదవండి: 'ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు'