రైతులకు ఉపయోగపడే విధంగా కిసాన్ రైలుని గుంటూరు నుంచి ప్రారంభించేలా అధికారులతో చర్చలు జరిపినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్‌ను ఎంపీ శుక్రవారం సందర్శించారు. నరసరావుపేట పార్లమెంట్ నియజకవర్గం పరిధిలోని రైల్వేస్టేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్ఎం మోహన్‌రాజాతో చర్చించారు. పట్టణాల్లో రైల్వే గేట్లను తొలగించి.. అండర్ బ్రిడ్జిలపై ప్రణాళికలు వేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం