గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా.. గత 29వ తేదీ నుంచి మే 3 వరకు పూర్తి లాక్ డౌన్ విధించినట్టు ఆర్డీఓ తెలిపారు. పట్టణ ప్రజలు నిత్యావసర సరుకులు, పాలకు ఇబ్బంది పడకుండా వారికి కావలసినవి ఇంటి ముందుకొచ్చి అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఏ వార్డుకు ఆ వార్డు ప్రజలకు సరుకులు అందించే వారి వివరాలు, మొబైల్ నెంబర్లను పత్రికా ముఖంగా తెలియజేస్తామని వివరించారు.
పట్టణంలో పూర్తి లాక్ డౌన్ విధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి పాల కోసం గుంపులుగా చేరుతున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. ఇకపై కావలసినవన్నీ ఇళ్లకే పంపుతామని చెప్పారు. ఎవరైనా బయటకు వస్తే వారిని క్వారంటైన్ కు తరలిస్తామని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: